విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ప్రియాంక అనే 21 ఏళ్ల యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు దాడికి యత్నించిన ఆమె గొంతు కోసాడు. ఆమె వోకల్ కార్డ్స్ పూర్తిగా దెబ్బతినడంతో చాలా రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతుంది. ఆమె ఆర్థిక పరిస్తితి తెలుసుకుని యువత సోషల్ మీడియా ద్వారా డబ్బులు సేకరించారు. కొన్ని రోజుల్లో ప్రియాంకకు ముంబై లో ఉన్న హాస్పిటల్ లో ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఆమెను కలిసి ఆమెలో ధైర్యం నింపి, కొత్త బట్టలు, ఆమెకు ఇష్టమైన వినాయక ప్రతిమ, ఫ్రూట్ జ్యూస్ మరియు ఆమె ముంబై ప్రయాణానికి కొంత ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. సీజ్ చేసిన ఆమె మొబైల్ ఫోన్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉండగా ఆమె పై దాడి చేసిన వాడు మాత్రం బెయిల్ పై బైట తిరుగుతున్నాడు. నాకు సహకరించిన శివ ప్రసాద్ గారికి, వీరు గారికి, సురేష్ గారికి, వీరేంద్ర గారికి, కరణ్ గారికి మరియు ప్రియకంక కు సహాయం చేసిన వారి అందరికీ ధన్యవాదాలు.