• వంద రోజుల ప్రభుత్వం తర్వాత ఆనందపు వెలుగులు
• ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు
• అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం
• తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి
• సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడిలకు గ్రాడ్యూటి అమలుచేయాలి
• మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ల్ గా మార్చాలి
• రిటైర్మెంట్ బెనిఫిట్ – 5 లక్షలు పెంచాలి పెన్షన్ 50% ఇవ్వాలి
• అంగన్వాడీలను స్కూల్స్‌తో కలపడం ఆపాలి
• రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్స్‌కి ప్రమోషన్ ఇవ్వాలి
• జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్
పిఠాపురం నియోజకవర్గం : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు . ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నెత్తి మీద చేతులు పెట్టి, ముద్దులు పెట్టి, లెక్క లేనన్ని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా, తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్లను నిరంకుశంగా అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం యొక్క కాలపరిమితి ఇక వంద రోజులు మాత్రమేనని ఆయన అన్నారు . అంగన్వాడి ఉద్యోగాన్ని అటు ప్రభుత్వం ఉద్యోగంగా కానీ, ఇటు ప్రైవేటు ఉద్యోగంగా కానీ పరిగణించకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టిందని… రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని, మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక మీ న్యాయపరమైన డిమాండ్లను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు . అలాగే నియోజకవర్గంలో గత రెండు రోజులుగా మూడు మండలాల్లో జరిగే అంగన్వాడీల నిరవధిక దీక్షకు మద్దతుగా తమ జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుదని, వారికి ఏ అవసరం ఉన్నా తమ పార్టీ తోడుగా ఉంటుందన్నారు . ఈ కార్య క్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.