ఆనందయ్యను ఘనంగా సత్కరించిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో వంశ పారంపర్య ఆయుర్వేద నిపుణులు అయినటువంటి శ్రీ బొణిగె ఆనందయ్య గారిని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ప్రాచీన భారతదేశ వైద్య సంపత్తి విలువలు ప్రపంచానికి చాటిన మహాఋషి సుశ్రుతుడిటో కూడినటువంటి చిత్రపటాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆనందయ్య గారికి అందించారు. కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ సంస్థ, రాష్ట్ర ఆయుష్ సంస్థల పరిశీలనల మీదట ఆనందయ్య గారి ప్రకృతి మందు పంపిణీకి అనుమతులు రావడం హర్షణీయమన్నారు. కరోనా మహమ్మారి పై పోరాటంలో ఇది ఎంతో కొంత సత్ఫాలితాలివ్వడం దైవేచ్ఛగా అభివర్ణించారు. ఈ ప్రకృతి మందు పంపిణీ ప్రక్కదారి పట్టకుండా, నకిలీలు మార్కెట్ లో ప్రవేశించకుండా, దీన్ని తీసుకునే ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తూ పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని కేతంరెడ్డి తెలిపారు. మందు తయారీ ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మల్లి శ్రీకాంత్ యాదవ్, సమాధి కస్తూరయ్య యాదవ్, చెరుకూరి హేమంత్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.