పార్కుల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరం: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా.. పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆల్ బ్యాంక్ కాలనీ పార్కులోని సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు కేవలం ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. పార్కులలో వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆల్ బ్యాంక్ కాలనీ పార్కులో వాకింగ్ ట్రాక్, లైట్లు, ప్లాట్ ఫాం, గేట్లకు పెయింటింగ్, సూచిక బోర్డులు సహా ఇతర సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు పార్కులలో ఎక్కువ సమయాన్ని గడిపేలా, ప్రతి పార్కును నగరపాలక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎటువంటి మరమ్మతులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పార్కులను మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన వాతావరణానికి కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన వెంట ఎస్ఈ రీటా, ఈఈ మదర్షా అలీ, ఏడీహెచ్ అనిత, డీఈ లోవరాజు, ఇతర సిబ్బంది ఉన్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.