రామచంద్రపురంలో నివర్ తుఫాను కారణంగా వరిపంట మునిగి, తడిసిపోయి మెులకలురావడం వలన రైతులు నష్టపోయారు. నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు,పార్టీ నాయకులు నష్టపోయిన పంటలను పరిశీలించారు.
వరి రైతులు సమస్యలను తెలుసుకున్నారు, తుఫాను కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ అధికారులు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.