అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఆదేశాల మేరకు రెండవ రోజు ఐ పోలవరం మండలం, జి వేమవరం, గుత్తినదీవి చిన్న కొడప పెద్ద కొడప గ్రామాలలో
ఉన్న రైతులు వద్దకు వెళ్లి రైతులు గోడును చూసి పితాని బాలకృష్ణ చలించిపోవడం జరిగింది. ఈ సందర్భంగా పితాని
బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా వర్షాలకు పాడయిన పంటలకు ఇన్సూరెన్స్
ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బస్తాకు 300 రూపాయలు సుమారు 400 రూపాయలు తక్కువకి
అడుగుతున్నారని అయినా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతినని
చెప్పుకోవటం కాదు, ఇప్పటికి అయినా సిగ్గు తెచ్చికుని రైతుల యొక్క ధాన్యాన్ని తడి పొడి అని వివక్ష లేకుండా షరతులు
లేకుండా ధాన్యాన్ని కనుగొలు చెయ్యాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్
ఎం.వాణితో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర 1530/- రూపాయిలు ప్రకటించాం అని చెప్పడం
తప్ప రైతు చేతికి 1100 రూపాయలు అంతకన్నా తక్కువకి అడుగుతున్నారని. దానికి తోడు ఇదంతా మీరు కనుగొలు
చేయకపోవటం వల్ల మిల్లర్లుసిండికేటు అయిపోయి దారుణానికి ఒడికడుతున్నారు అని, ప్రభుత్వం ఎకరానికి 45బస్తాలే
కొంటాం అని నిబంధనలు పెట్టడంతో మిగులు పంట ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్
థితిలో ఈరోజు రైతు
ఉన్నాడని పడించిన ధాన్యని వెంటనే కనుగొలు చెయ్యాలి
జనసేన పార్టీ తరుపున పితాని బాలకృష్ణ ఏఓ ఎం.వాణికి
డిమాండ్ చెయ్యడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్
జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణకి సానుకూలం
స్పందించి ధాన్యాన్ని వెంటనే కనుగొలు చేస్తాం అని
కచ్చితంగా రైతులను ఆదుకుంటాం అని బాలకృష్ణకు
భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం
అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం ఎంపిటిసి లంకలపల్లి
జమ్మి, కర్రి శేఖర్, సలాది రాజా, ఇండుగుల రామకృష్ణ,
లంకలపల్లివెంకటేశ్వరావు, పడాల లక్ష్మణ్, మారిశెట్టి
శ్రీను, మారిశెట్టిదుర్గాప్రసాద్, పోలినాటి వినీల్, కాశీ
రాజు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు