
Shivam Dube టీమిండియాకు T20 ప్రపంచ కప్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సాధారణ ప్రయాణికుడిలా 3rd AC రైలులో ప్రయాణించిన ఘటన ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం విమానాలు అందుబాటులో లేకపోవడంతో టోపీ, మాస్క్ ధరించి నిశ్శబ్దంగా రైలులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ అయినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ప్రయాణించిన ఆయన నిరాడంబరత అభిమానులను ఆకట్టుకుంటోంది.
టీమిండియాకు T20 ప్రపంచ కప్ 2026 అందించడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత, ఆల్ రౌండర్ శివం దూబే అహ్మదాబాద్ నుండి ముంబైకి ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా, ఇలాంటి స్టార్లు చార్టర్డ్ ఫ్లైట్‌లలో లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు.
కానీ, వరల్డ్ కప్ ఫైనల్ రద్దీ కారణంగా ఆ సమయంలో ముంబైకి ఒక్క విమానం కూడా అందుబాటులో లేదు.
దీంతో, ఈ వరల్డ్ కప్ విజేత ఒక ఊహించని పని చేశాడు!
ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి టోపీ, మాస్క్ మరియు ఫుల్ హాండ్స్ షర్ట్ వేసుకుని… 3rd AC ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు బయలుదేరడానికి కేవలం కొన్ని నిమిషాల ముందే కారు నుండి దిగి, నిశ్శబ్దంగా తన కోచ్‌లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తన అప్పర్ బర్త్ ఎక్కి, ప్రయాణం మొత్తం ఏమాత్రం హడావిడి లేకుండా సాధారణ ప్రయాణికుడిలానే గడిపాడు. రాత్రి సమయంలో అతను వాష్ రూమ్ ఉపయోగించడానికి కిందకు దిగినా, ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదంటే నమ్మగలరా! ![]()
టోర్నమెంట్‌లో 235 పరుగులు చేసి, ఫైనల్‌లో కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు బాది… భారత్ ట్రోఫీ నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించిన ప్లేయర్ ప్రయాణం ఇది! ![]()
వరల్డ్ కప్ ఫైనల్ మెరుపుల నుండి… రైలులోని అప్పర్ బర్త్ వరకు! ![]()
కొంతమంది ఆటగాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, నిశ్శబ్దంగా తమ పని చేసుకుంటూ ముందుకు సాగిపోతారు.
శివం దూబే నిరాడంబరతకు జైహో !