


ధర్మానికి మూర్తీభవించిన రూపం రాముడు అనే విస్తృతార్థంలో ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే వాక్యాన్ని చెబుతాము. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి ప్రతీక శ్రీరామ చంద్రమూర్తి. కాబట్టే వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలను రామ పారాయణం చేస్తూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించే సంస్కృతి మనలో ఇమిడిపోయింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.