మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ జేఏసీ నాయకులు – సమస్యల వినతి పత్రం సమర్పణ

డియర్ కామ్రేడ్స్!
యూనియన్ జే ఏ సి నాయకులు మరియు మొగల్తూరు, నరసాపురం,పాలకొల్లు,యలమంచిలి,భీమవరం,అత్తిలి,మార్టేరు బ్రాంచ్ ల పరిధిలోని సహకార సంఘ ఉద్యోగులు,గుంటూరు జిల్లా నాయకులు,ఏలూరు జిల్లా నాయకులు,తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఈ రోజు మంగళగిరి లోని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సమస్యలను తీసుకు వెళ్లడమైనది.మన సమస్యలపై ఉపముఖ్యమంత్రిగా రి కార్యాలయం నుండి సహకార మంత్రి గారికి మెయిల్ పంపడమైనది,తదుపరి తెలుగుదేశం జాతీయ పార్టీ కార్యాలయం లో మంత్రి లోకేష్ గారి పి ఆర్ ఓ గారి ద్వారా మన సమస్యల వినతి పత్రాన్ని అంద చేయడమయినది.అక్కడే ఉన్న శాసన మండలి సభ్యులు శ్రీ అశోక్ బాబు గారికి కూడా మన సమస్యలు వివరించారు.ఉప ముఖ్యమంత్రి గారి ని కలవడానికి ఏర్పాటు చేసిన కొప్పర్రు సొసైటీ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు.
ఇట్లు
పి విజయ్
యూనియన్ అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.