
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ గారి హాజరు ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి.