ఆపదలో అండగా జనసేన… బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

  1. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రాణానికి భరోసా
  2. వేములపాటి అజయ్ కుమార్ ప్రేరణతో రూ1,00,000 లక్ష ఆర్థిక సహాయం

నెల్లూరు సిటీ: కష్టపడి జీవనోపాధి సాగిస్తున్న ఓ కుటుంబాన్ని వరుసగా ఆపదలు వెంటాడుతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన తర్వాత ధైర్యంగా నిలబడుతున్న ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన తమ్ముడు వెంకటాద్రికి తీవ్ర ఆరోగ్య సమస్య ఏర్పడిందని రేవతి ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్థిక స్థోమత లేకపోవడంతో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆదుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఇదే విషయంపై కలెక్టర్‌కు కూడా అర్జీ సమర్పించింది.

వెంకటాద్రికి లివర్ తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర చికిత్స అవసరమైంది. కుటుంబ సభ్యులు లివర్ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆపరేషన్‌కు అవసరమైన భారీ ఖర్చును భరించే పరిస్థితి లేదని తెలిపింది.

ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ వెంటనే స్పందించారు. ఆయన ప్రేరణతో జిల్లా నాయకులు కలిసి రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని గురువారం ఆ కుటుంబానికి అందించారు.

రేవతి, వెంకటాద్రికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ, ఇది కేవలం సహాయం కాదు, ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నమని తెలిపారు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు నెల్లూరులో ఏ జనసైనికుడికైనా, వీర మహిళకైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జమీర్, ప్రశాంత్ గౌడ్, సాయి, రాధమ్మ, లత, అనిల్, సురేష్, శ్రీకాంత్, రాజేష్, కృష్ణ, సురేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.