ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం విజయవాడలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై ఆయన మంత్రితో చర్చించారు.

ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సదుపాయాలపై వివరంగా చర్చ జరిగినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఈ విషయాలపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో నరసాపురం ప్రాంత అభివృద్ధికి మరింత వేగం చేకూరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.