
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, డెవలపర్లు మరియు ప్రభుత్వం మధ్య సమన్వయ మధ్యవర్తి పాత్రలో పనిచేసి ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ NAREDCO (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) తెలంగాణ రాష్ట్రం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
ఆయన అనుభవం, నాయకత్వం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, సమర్థవంతమైన పాలనకు దారితీస్తుందని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రధానంగా తోడ్పడతారని అభిప్రాయపడుతున్నారు.