MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. కేకేఆర్ బ్యాటింగ్‌

MI vs KKR: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మరో అరుదైన ఘనతను సాధించింది. 300 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతుండటం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. సొంత మైదానంలో ముంబైకి ఉన్న రికార్డు దృష్ట్యా ఈ నిర్ణయం కీలకంగా మారింది.

గత రికార్డులను పరిశీలిస్తే, ఈ రెండు జట్ల మధ్య ముంబైకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచ్‌లలో ముంబై 24 సార్లు గెలవగా, కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. వాంఖడేలో అయితే ముంబై మరింత బలంగా నిలిచి, 12 మ్యాచ్‌లలో 10 విజయాలు సాధించింది.

ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, కేకేఆర్ మూడు టైటిల్స్ గెలుచుకుంది. అయితే గత సీజన్‌లో కేకేఆర్ నిరాశపరిచిన నేపథ్యంలో, ఈసారి బలంగా తిరిగి రావాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ దళం కేకేఆర్ బ్యాటింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందో, మరోవైపు కేకేఆర్ ఈ గణాంకాలను మార్చగలదో అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.