
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా నమోదవుతోంది. ఫిబ్రవరి 26వ తేదీన మొదలైన సభ్యత్వ నమోదు ఊరూరా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ తోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు, అభిమానులు సభ్యత్వాన్ని పొందుతున్నారు. ప్రవాస భారతీయులు ఆన్ లైన్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకొంటున్నారు. సభ్యత్వ నమోదు గడువును 17వ తేదీ వరకూ పొడిగించాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 10వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సభ్యత్వ నమోదు గడువు పెంచాలనే విజ్ఞప్తులు కేంద్ర కార్యాలయానికి వచ్చాయి. అదే విధంగా పార్టీ శాసన సభ్యులు సైతం మరి కొద్ది రోజులు గడువు అవసరమని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయ్యే సమయంలో అసెంబ్లీ ఉండటంతో ఆ సమావేశాల్లో నిమగ్నమయ్యామని… సభ్యత్వ నమోదు ప్రక్రియని తమ నియోజక వర్గంలోని ప్రతి ఊరిలోనూ ఒక వేడుకలా కొనసాగిస్తామని విజ్ఞప్తి చేయడంతో 17వ తేదీ వరకూ గడువు పొడిగించారు.