ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుక – 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

\

ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Nara Lokesh యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ క్యాలెండర్‌లో ఉపాధ్యాయులు, గ్రూప్-1, గ్రూప్-2, ఇంజినీరింగ్, పోలీస్ శాఖలు వంటి విభిన్న విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయుల పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,000 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశం అని ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.