
చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి
ప్రేమపూర్వక జన్మదిన శుభాకాం క్షలు అంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన
తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం… వెల కట్టలేని
జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన
చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి. ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు..
కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరిం చే పట్టు దల ఆయన నుంచే
నేను నేర్చుకున్నాను . అన్నిటిని భరిం చే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన ‘విశ్వం భరుడు’..! పితృ సమానుడైన అన్నయ్యకు ,
మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదిం చాలని మనసారా
కోరుకుంటున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు.