
నరసాపురం మండలంలోని లిఖితపూడి గ్రామంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు మరియు అన్నసంతర్పణ కార్యక్రమంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు కొప్పర్రు PACCS చైర్మన్ మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారి సెక్యూరిటీ కోఆర్డినేటర్ శ్రీ అందే నరేన్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శ్రీ అందే నరేన్ గారికి వినాయకుడి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.
గ్రామ బాలబాలికలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాంప్రదాయపూర్వకంగా జరిగిన ఈ వేడుకలో గ్రామ ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.