
* పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి
* మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి
* రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు అమలు చేయాలి.
* డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి
* గంజాయి వంటి మాదక ద్రవ్యాల అనర్ధాలపై, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించాలి
* ఎన్ఫోర్స్మెంట్ను పెంచి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.
ప్రకాశం జిల్లా, బాధితులకు వేగవంతంగా, పూర్తిస్థాయిలో న్యాయం అందించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ఆ స్ధాయిగా సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా గ్రేవ్/నాన్‌గ్రేవ్ కేసులు, హత్య కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, ప్రాపర్టీ కేసులు, పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు, ఆయా సబ్డివిజన్లలోని సీసీ కెమెరాల పనితీరు, ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సమావేశంలో పెండింగులో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో సాక్ష్యాలతో నేర నిరూపణ చేసి శిక్షలు పడే విధంగా చూడాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణిత గడువులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంచుకోవాలని సూచించారు.
నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకుని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేసి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో చెడునడతగల వ్యక్తులు, పాతముద్దాయిలపై నిఘా పెట్టాలని, ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని, పేకాట, మట్కా గంజాయి, కోడి పందాలు,బెట్టింగ్ పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. గ్రామ సందర్శనలు చేసి ఎక్కడైనా గ్రామాలలో గొడవలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని, ముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
సైబర్ నేరాలు,గంజాయి వంటి మాదక ద్రవ్యాల అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ,కొత్త చట్టాలు, శిక్షలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
కెమెరాల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేసి ఏర్పాటు చేసే విధంగా చూడాలని, పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించిన ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టి, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం త్రాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పలు సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.