

పి. గన్నవరం నియోజకవర్గం: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన 2.50 లక్షల గృహాల కార్యక్రమంలో భాగంగా అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో 69 గృహాలు పూర్తయ్యాయి. వీటిలో 3 గృహాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 01-06-2024 నుంచి 30-03-2026 వరకు నియోజకవర్గంలో మొత్తం 1367 గృహాలు పూర్తి చేశారు. మండలాల వారీగా అయినవిల్లి – 333, అంబాజీపేట – 475, పి. గన్నవరం – 385, మామిడికుదురు – 174 గృహాలు పూర్తయ్యాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద 4957 మంది లబ్ధిదారులను గుర్తించి, ఏప్రిల్‌లో మంజూరు చేసే అవకాశం ఉంది. యూనిట్ విలువ రూ.2.39 లక్షలుగా నిర్ణయించారు.
పేదలకు గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.