జనసేనలో నెల్లూరు జిల్లా ప్రముఖుల చేరిక

• పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన శ్రీ కె. నాగబాబు, శ్రీ తాళ్లూరి రామ్
నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం విజయవాడలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత అని, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారని, పార్టీ బలోపేతం కోసం కష్టపడే కార్యకర్తలకు అర్హతలకు అనుగుణంగా పదవులు వస్తాయని స్పష్టం చేశారు. శ్రీ తాళ్లూరి రామ్ గారు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల మాదిరిగా ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టిడ్కో చైర్మన్, జనసేన కాంప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు శ్రీ సయ్యద్ అజాద్ జమీర్, శ్రీ మల్లిఖార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో పప్పు నారాయణ, పప్పు సాయిరామ్, పప్పు లక్ష్మీనారాయణ, పటాన్ కాజా మియా, పేరంశెట్టి హరిబాబు, సయ్యద్ షాజహాన్, కోడూరు వెంకటరామిరెడ్డి, నున్న మురళీమోహన్, నున్నం శ్రీనివాసులు నాయుడు, గుండు సుబ్రహ్మణ్యం, గాదిరాజు జీవన్ కృష్ణ, చిరమణ సురేష్, బాచుపల్లి మల్లికార్జున, గునకల ధనుంజయరావు, కావలి వెంకటసుబ్బయ్య, జానీ, చీమకుర్తి స్వాగత్, సయ్యద్ కరీం భాష, నాగినేని అరవింద్, సయ్యద్ సాజిద్ అహ్మద్, షేక్ రహాన, ఆర్ఎస్ విజయ, కందిశెట్టి రాఘవేంద్ర, భార్గవ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.