చిత్తూరు జనసేనలో చేరికలు

• పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన శ్రీ కె. నాగబాబు, శ్రీ రామ్ తాళ్ళూరి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రమఖ పారిశ్రామికవేత్త శ్రీ గుర్రం రఘురామ్ చౌదరి, ప్రముఖ ఐటీ నిపుణులు శ్రీ ఎన్. మునికేశవ్(కిరణ్) శుక్రవారం జనసేనలో చేరారు. శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలో చేరుతున్న వారు పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ముఖ్యంగా కూటమి పార్టీలతో, నాయకులతో, కార్యకర్తలతో ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా సత్సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, పూల ప్రభాకర్, ఏపీ శివయ్య, బీ. కుమార్, డీ. ప్రభాకర్, ఉదయ్ ఏఎస్, ఎం మహేష్, ఏ. శాంతమూర్తి, పవన్ కుమార్, పూల హేమంత్, కొండేటి తరుణ్, జీపీ. సంతోష్, కే. రాకేష్, పవన్, ఏ. రమేష్, శ్రీ దుర్గ, వసంత, వెంకట రమణ, రాము, రాజేష్, రిషి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.