గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్కి, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం.
ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా వుంది. తగిన సమయం ఇవ్వకుండా, సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కేవలం మొక్కుబడిగా గోచరిస్తోంది. రాజకీయ లబ్ది కోసమా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడివుంది. అయితే ఆ పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది. మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని జనసేన విశ్వసిస్తోంది. బలమయిన పోరాటంతోనే హోదా సిద్ధిస్తుంది. అటువంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.