ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటనకు ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై జనసేన పార్టీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాడేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై డా. వంపూరు గంగులయ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, బొంకులు దివ్యలత, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, జి. మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, జీకే వీధి మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే సీనియర్ నాయకులు వంపూరు రమేష్ (పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్), తల్లే త్రిమూర్తులు (పి.ఏ.సి.ఎస్ చైర్మన్), కుంచె దేవేంద్ర ప్రసాద్, రేగం అప్పలకొండబాబు, కొయ్యం ఇమ్మానుయేల్ (సిద్దు), గుండ్ల రఘువంశీ, పాంగి శ్రీను, జయరాజు, మఠం శ్రీనివాస్ రావు, గోపినాయక్ ప్రశాంత్, పాంగి కామరాజు, కొర్ర కామరాజు, మాతే వర్మ, సాగిన బద్రీనాథ్, సాగిన వెంకట్ కిరణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.