
అన్నయ్య శ్రీ చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంలో పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం – ఆయన విశాల హృదయాన్ని చాటిందని ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు. విద్యా దానం ద్వారా జ్ఞాన వ్యాప్తి సాధ్యమవుతుంది. పేదల ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలనుకొంటున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవా గుణంతో మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారని శ్రీ పవన్ కళ్యాణ్ శ్లాఘించారు.