తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఓడిపోయారు, ప్రత్యర్దులు డబ్బులు పంచారు నేను పంచలేదు అందుకే ఓటమి అన్నారు. తప్పులేదు ఓటమికి కారణం చెప్పుకున్నారు.
2019 ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ గారు కూడా తనని ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు. డబ్బులు పండానికి తాను వ్యతిరేకం నేను పంచను అన్నారు. అప్పుడు ఈ పెద్ద మనిషే పవన్ కళ్యాణ్ ప్రజలని అమ్ముడుపోయారని అవమానించాడు అన్నారు. రాజకీయం రాజకీయంలా చేయాలి అన్నారు. సిద్దాంతాలు విలువలతో నడవదు అన్నారు. ఇప్పుడు ఈ పెద్దమనిషే డబ్బులు పంచలేకపోవడం వల్లే తాను ఓడిపోయాయాను, డబ్బులు పంచడానికి తాను వ్యతిరేకం అంటున్నారు. తన దాకా వచ్చేసరికి ప్రజలది తప్పు..వేరే వారి దగ్గరికి వచ్చేసరికి ప్రజలని అవమానించడం.