బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారికి మద్దతుగా ప్రచారం..

తిరుపతి ఉప ఎన్నికలలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారికి మద్దతుగా ప్రచారం, సమన్వయ సమావేశాల నిమిత్తం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ మనోహర్ గారికి జనసేన, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాయుడుపేటలో ఈ నెల 12న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.