జగ్గంపేట, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జగ్గం పేట నియోజకవర్గంలో పుష్కర ఎత్తి పోతల పథకం ఆయకట్టులో ఉన్న 32 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయి రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాల్లిెంచ్లని గత 6 రోజుల నుండి జగ్గం పేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర ఆమరణ నిరాహారదీక్ష చేస్తుండడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి నీటిని విడుదల చేసి రైతూలను ఆదుకోవాలని ఒక వినతిపత్రం రాయడం జరిగింది. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.