ప్రముఖ నటులు, డి.ఎమ్.డి.కె. పార్టీ అధినేత శ్రీ విజయకాంత్ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను . తమిళ చి త్రసీమలో కథానా యకుడిగా తనదైన స్థానాన్ ని కలిగిన శ్రీ విజయకాంత్ గారి చి త్రాలను తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరిం చారు. కుటుం బ కథాంశాలతోపాటు సా మాజిక అంశాలు మేళవించి న యాక్షన్ చి త్రాలలో నటిం చారు. సా మాజిక స్పృహతో డి.ఎమ్.డి.కె. పార్టీ స్థాపిం చారు. 2005లో శ్రీ విజయకాంత్ గారు పార్టీ ప్రకటించి న రోజు నేను మధురై ప్రాం తంలో షూటిం గ్ లో ఉన్నాను . అక్కడి ప్రజల స్పం దన ప్రత్యక్షం గా చూశాను . ప్రజలపట్ల శ్రీ విజయకాంత్ గారు స్పం దిం చే తీరు, సమస్య వస్తే తెగించి పోరాడి అండగా నిలిచే విధానం మెచ్చుకోదగినవి. ఆపదలో ఉన్న వారి పట్ల మానవతా దృక్ప థంతో స్పం దిం చేవారు. ఆయనకు తొలి అడుగులో ఎదురైన ఫలితానికి అధైర్య పడక రాజకీయాల్లో నిలబడ్డారు. అదే ఆయన పోరాట పటి మను తెలియచేస్తుంది . పరిస్ థితులకు ఎదురొడ్డి సిం హంలా నిలిచేవారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానా లు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ తత్వం తోనే తమిళనా డు అసెం బ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం వహిం చారు. శ్రీ విజయకాంత్ గారి ని చి వరిసారి గా 2014లో పార్లమెం ట్ సెం ట్రల్ హాల్లో కలిశాను . తమిళనా డు రాష్ట్రానికి ముఖ్య మంత్రి కా దగ్గ నా యకుడు అని ఎందరో భావిం చారు. ఆరోగ్యం క్రమంగా క్షీణిం చడంతో తుదిశ్వా స విడిచారు. శ్రీ విజయకాంత్ గారి మృతికి ది గ్భ్రాంతిని తెలియచేస్తూ ఆయన కుటుం బ సభ్యు లకు నా ప్రగాఢ సాను భూతి తెలియచేస్తున్నాను . రాజకీయ వారసత్వాన్ ని ఆయన సతీమణి శ్రీమతి ప్రేమలత గారు కొనసా గిస్తారని ఆశిస్తున్నా నని జనసేనా ని పేర్కొన్నారు.