విశాఖపట్నంలో ని ఫిషింగ్ హార్బర్ లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్ లు దగ్ధం కావడం దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు . ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను . వీటిపై ఆధారపడ్డ మత్స ్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలి. భద్రతపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలి అని జనసేనాని కోరారు.