అల్లూరి సీతారామరాజు జిల్లా , రంపచోడవరం నియోజకవర్గంగుం, రంపచోడవరం మండలం, రంప పంచాయతీ మర్రివాడ గ్రామంలో మండల అధ్యక్షులు పి .ఆర్.పి శ్రీను అధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలకు విధి విధానాలకు ఆకర్షితులు అయ్యి 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది . వీరిని నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదని కనీస సౌకర్యలు అయిన రోడ్, ఆరోగ్యం , సురక్షిత మంచినీరు, అందించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వీటిని ప్రజలకు అందిస్తామని తెలియచేశారు. ఈ కార్య క్రమంలో కొణతం శ్రీనివాస్, ఆకుల జయరామ్, గుగులు సుబ్రమణ్యం , యర్రగొండ మల్లేశ్వరరావు, సింగోజి సుబ్రమణ్యం , వేదురుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.