రాజంపేట పట్టణం గొల్లపల్లి, నారపరెడ్ డిపల్లి, ఉప్పరపల్లి, గ్రామంలో జనసేన రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం 123వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య వంతులు చేస్తూ జనసేన పార్టీ సిద ్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద ్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్‌కు ఓట్లు వేసి జనసేన పార్టీని అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు గుండా రాజకీయాలు దోపిడీలు చేస్తూ వైకాపా పాలన కొనసాగుత ుందని తెలిపారు. ఎదురు తిరిగిన వారిపై, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని వివరించారు. ఈసారి మళ్లీ జగనే అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు బతకలేరని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య , జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, కొత్తూరు వీరయ్య ఆచారి, నారా కిషోర్, చౌడయ్య , గోవర్ధన్ ఆచారి, జనసే న వీర మహి ళలు జడ్డ శి రీష తదితరులు పాల్గొన్నారు.