కడప: పట్టణంలో బీసీ సంఘాలకు భరోసాగా జిల్లా రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన బిసిలకు ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహంపై బీసీ సంఘాల ఐక్య పోరాటం సమావేశానికి మద్దతు తెలిపిన జనసేన పార్టీ. తెలుగుదేశం మైదుకూరు ఇంచార్జ్ మరియు టిటిడి మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ అధ్యక్షతన, మాజీ మంత్రివర్యులు నిమ్మల కృష్ణప్ప పరిశీలకులుగా బిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి కడపజిల్లా కోర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి సురేష్ బాబు, కడప నాయకులు, పండ్రా రంజిత్, పత్తి విశ్వనాధ్, బోరెడ్డి నాగేంద్ర, శరత్ చంద్ర, చార్లెస్, అలీ, పులివెందుల నాయకులు తుపాకుల చంద్ర, ప్రొద్దుటూరు నాయకులు షేక్ జిలనీ బాషా, మైదుకూరు నాయకులు కృష్ణమూర్తి, రామా గోవింద్, శ్రీరామ్ వంశీ, రాజంపేట నాయకులు రామ శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు మరియు టీడీపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.