రాజోలు నియోజవర్గం : రాజోలు మండలం, శివకోటి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను జనసేన శ్రేణులు, రైతులతో కలిసి పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యం తక్షణ కొనుగోలు చేయాలి. పంట బీమా కూడా అందించాలి. మీము చివరి వరకు రైతులుతోనే ఉంటాము. ఈ పరిస్థితిలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వివరిస్తాము. నియోజకవర్గం రైతులు, జనసేన నాయకులు మేకలు ఏసుబాబు, దూది శ్రీనివాసరావు, బందెల రత్న రాజు, పోలిశెట్టి గణేష్ పాల్గొన్నారు.