పాలంకి హరికృష్ణ కుటుంబానికి అండగా జనసేన-టిడిపి

పరిటాల గ్రీన్వే బిల్డింగ్స్ బ్రిక్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న పాలంకి హరికృష్ణ గత తొమ్మిది నెలలు క్రితం కంపెనీ యాజమాన్య అశ్రద్ధతో ప్రమాదవశాత్తూ మరణించడం జరిగింది . అప్పుడు ఆ కంపెనీ మేనేజర్ మరియు ఎండి తోటకూర శ్రీనివాసరావు బాధితుడి కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇస్తాను అని పరిటాల గ్రామ పెద్దలు కొంతమంది నాయకులు ఆధ్వర్యంలో హామీ ఇవ్వడం జరిగింది . కానీ ఇంతవరకు బాధితుడి కుటుంబానికి సరైన న్యాయం చేయకపోవడంతో వాళ్ల కుటుంబం ధర్నాకి కూర్చున్నారు . హరికృష్ణ కుటుంబానికి మద్దతుగా బుధవారం జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి ఆ కుటుంబాన్ని పరామర్శించి పరిటాల గ్రీన్వే బిల్డింగ్ బ్రిక్స్ కంపెనీలో బాధితుడికి ఏం జరిగిందో తెలుసుకుని ఆ కుటుంబానికి బాధితుడి భార్య మరియు ముగ్గురు పిల్లలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ కంపెనీ నుండి తగిన న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోగంటి బాబు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.