రాష్ట్రంలో కరవు పరిస్థితులపై తీర్మానం

కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుంది అని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమే. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం అనేది వాస్తవం. 25 లక్షల ఎకరాలలో సాగు కూడా చేయలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతోపాటు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయింది. సకాలంలో సాగు నీరు కూడా ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బ తిన్నాయి . సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికారయంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమే. వర్షాభావం మూలంగాను, సాగు నీరు అందకపోవడం వల్లా పంటలు కోల్పోయి న అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తిం చాలనీ, రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, ఇన్స్యూరెన్స్ మీద ఉన్న అయోమయాన్ని తొలగించి.. ఇన్స్యూరెన్సును తక్షణమే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ విజయవాడలో జరిగిన జనసేన – తెలుగుదేశం సమన్వయ సమావేశం డిమాండ్ చేసింది. జనసేన, తెలుగు దేశం రైతాంగానికి అండ నిలుస్తాయని.. కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.