
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తి, ఆనందాల మధ్య ఘనంగా జరుగుతోంది. ఈ పవిత్ర సందర్భంలో భక్తులు ఆలయాలకు చేరుకుని రామపారాయణం చేస్తూ, సీతారాముల దివ్య కల్యాణాన్ని వీక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు అందే నరేన్ గారు భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి ప్రతీకలైన శ్రీరాముడు, సీతాదేవి ఆశీస్సులు ప్రతి ఇంటికి సుఖశాంతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు.
సంప్రదాయం, సంస్కృతి మనకు అందించిన ఈ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, సమాజంలో ఐక్యత, సద్భావన పెంపొందాలని ఆయన పిలుపునిచ్చారు.