
జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ అభివృద్ధి మరియు ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం కొప్పరు గ్రామానికి చెందిన జనసేన సాధక్ పోలిశెట్టి శ్రీనివాస్ గారు విశేష కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో 1000 పైగా సభ్యత్వాలను నమోదు చేయడం విశేషంగా నిలిచింది.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఈ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతోంది. పోలిశెట్టి శ్రీనివాస్ గారి కృషి జనసేన కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తోంది.
జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.