నరసాపురం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహప్రవేశం

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణంలోని సోమవారం చర్చ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం ద్వారా నిర్మాణమైన గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ లబ్ధిదారునితో కలిసి గృహప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దశలవారీగా ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. మొదటి విడత కింద 2025 నవంబర్ 12వ తేదీన 3,00,192 ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం, రెండో విడతగా ఈరోజు మరో 2,50,893 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోందని వెల్లడించారు.

పేదల గృహ కలను సాకారం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించే వరకు తమ కృషి నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో స్థిరత్వం, భద్రత కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.