
కోనసీమ, రాష్ట్ర వ్యాప్తంగా గాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గాని ఎక్కడా కూడా పెట్రోలు డీజిల్ కి ఏ విధమైన కొరత లేదు. గతంలో జిల్లా వినియోగం ఎంతయితే ఉందో అంత పెట్రోలు, డీజీలు మన బంకులకి వస్తున్నాయి అని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ తెలియజేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆధారపడి ఎవరూ కూడా కంగారు పడవద్దని కంగారు పడి ఎక్కువ ఆయిల్ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరుతున్నారు. ఈ వదంతులను నమ్మి చాలా మంది పెద్ద పెద్ద క్యాన్లలో బాటిల్స్ లో పెట్రోల్ పోయమని బంకులకి వస్తున్నారు కానీ పిసో నిబంధనల ప్రకారం ఆ విధమైన పద్ధతిలో పోయడం చట్టవిరుదం. నేరుగా వాహనాల్లోకి మాత్రమే పెట్రోల్ గానీ డీజిల్ గాని పోయాలి. వినియోగదారులు ఎవరు దయచేసి కంగారుపడి వ్యవస్థను అస్తవ్యస్తము చేయవద్దు. బంకు యజమానులు కూడా ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించాలి మరియు బల్క్ పాత్రల్లో పెట్రోల్ పోయడం నిలిపివేయాలి. ఈ విధమైన చర్యలకు పాల్పడితే బంకులపై తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు.