శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ప్రత్యేక బస్సులు

* ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు వెల్లడి

ఏలూరు, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏలూరు డిపో నుండి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుండి 14 బస్సులు, నూజివీడు నుండి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు నుండి 1 మనిషికి ఎక్స్ ప్రెస్ ధర రూ 250, అల్ట్రా డీలక్స్ కీ ధర రూ. 310, సూపర్ లగ్జరీ ధర రూ. 320 గా నిర్ణయించడమైనది. మార్చి 26 వ తేదీన బుధవారం ఉదయం నుండి బస్సులు బయలుదేరుతాయని, మార్చి 27న స్వామివారి కల్యాణం అనంతరం తిరుగు ప్రయాణం అవుతుందని అన్నారు. దర్శనానికి విచ్చేయు భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.