
ప్రత్తిపాడు నియోజకవర్గం: కాకుమాను మండల పాండ్రపాడు గ్రామంలో కాకుమాను మండల కార్యదర్శి రెడ్డి నాగరాజు అధ్యక్షతన జనసేన పార్టీ ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని, అందుకే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సభ్యత్వం కేవలం ఇన్సూరెన్స్ కాదు, పార్టీ బలోపేతానికి శక్తివంతమైన ఆయుధం. జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ చెప్పారు, సభ్యత్వం ద్వారా పార్టీకి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకా రాజు, ప్రతి కుటుంబం నుండి కనీసం ఒకరు సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాకుమాను మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు సమాజంలో న్యాయం, పారదర్శకత, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
గ్రామస్థులు ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఇచ్చి పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇదే తరహాలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని నాయకులు సంకల్పించారు.
కార్యక్రమంలో కాకుమాను మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల పూర్ణ, గ్రామ అధ్యక్షులు తోకల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నిమ్మా శ్రీనివాస్, వట్టిచెరుకూరు మండల నాయకుడు గంగిశెట్టి వెంకట్, గ్రామ నాయకులు తోట అంకమ్మ రావు, నిమ్మా వెంకటేశ్వర్లు, సాంబశివరావు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.