
RCB vs SRH IPL: ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు మొదటి నుంచే దూకుడు ప్రదర్శించారు. దేవదత్ పడిక్కల్ 28 బంతుల్లో 61 పరుగులతో మెరిపించగా, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో అద్భుత అర్థశతకం నమోదు చేశాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పింది.
తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ 31 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. హైదరాబాద్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆర్సీబీ బ్యాటర్ల దూకుడును ఆపలేకపోయారు.
ఈ విజయంతో ఆర్సీబీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించగా, చిన్నస్వామి మైదానంలో అభిమానులకు మరిచిపోలేని మ్యాచ్‌ను అందించింది.