
• ఆ మహనీయుడి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నా
వందేళ్లకు ముందే విద్య ద్వారానే సాధికారత సాధించవచ్చు అని విశ్వసించి, ఆ దిశగా ప్రజల్లో చదువు ప్రాధాన్యత చాటిన సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ దొమ్మేటి వెంకట రెడ్డి గారు అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. శెట్టిబలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడిగా శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారు- శెట్టిబలిజ సామాజిక వర్గంలో విద్యా జ్యోతి వెలిగించే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి కోసం బర్మా దేశానికి వలస వెళ్లిన శెట్టిబలిజలకి విద్య అందించేందుకు వయోజన పాఠశాలలు మొదలుపెట్టి అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయన చేసిన సేవలు నవతరానికి తెలియచేసే అవకాశం లభించిందని శ్రీ పవన్ కళ్యాణ్ వివరించారు.