ఉదయగిరి: పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ఉదయగిరి నియోజకవర్గం: వింజమూరు మండలం, ఊటుకూరు పంచాయతీ హైస్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. భోగినేని కాశీ రావు అధ్యక్షతన, జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాసిన కమిటీ సభ్యులు విద్యార్థులకు సామాగ్రి అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు భోగినేని కాశీ రావు మాట్లాడుతూ, 10వ తరగతి జీవితం లో అత్యంత కీలక ఘట్టమని, చదువుతో గౌరవం, కుటుంబ పురోగతి సాధ్యమని, మంచి చదువులు చదివి సమాజానికి సేవ చేయాలని స్పష్టం చేశారు. పేదరికంలో పుట్టినా ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధికి కృషి చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని మంచి మార్కులు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీ రావు, గవ్వల వెంగయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి మరియు జనసైనికులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.