ఏలూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

ఏలూరు: బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువతి యువకులు కూడా “ఉద్యమి” సభ్యత్వం తీసుకుని ఈ మార్పు ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు.

ఏలూరు నియోజకవర్గంలోని 50 డివిజన్ లోను జరుగుతున్న సభ్యత్వ నమోదు శిబిరాలను ఆయన సందర్శించారు. ప్రజలందరూ కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజం సాధ్యమవుతుందని అన్నారు. 50 డివిజన్లలోను క్రియాశీలక వాలంటీర్లు (ఉద్యమి) కలిసికట్టుగా పని చేయాలని, మన శక్తి, మన ఐక్యతే మన బలమని, కలిసికట్టుగా నడిచి, బాధ్యతగా పనిచేసి, భవిష్యత్తును నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సాధకులకు ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ఆయా శిబిరాలకు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ సభ్యత్వాలు రెన్యూవల్ చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.