
రాజమండ్రి లోని షెల్టన్ హోటల్లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు మరియు నియోజకవర్గ స్థాయి కార్యాచరణపై నాయకులతో సమీక్ష జరిగినట్లు సమాచారం.