రంజాన్ పండుగను పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు నరసాపురం పంజా సెంటర్ అంజూమాన్ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ తరపున ఆత్మీయ ఇఫ్తార్ విందును నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు, మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం, క్రమశిక్షణలు మంచి నడవడికను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, సోదరులు, జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.