నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరి,వేరుశనగ రైతులకు నష్టపరిహారంగా 35000,తక్షణ సహాయం కింద 10000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన నివాసం నుంచే ర్యాలీగా వెళ్లి ధర్మవరం పట్టణంలో MRO ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో చిలకం మధుసూదన్ రెడ్డి గారు(PAC) మాట్లాడుతూ రైతులకు వెంటనే 10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. ఒక పార్టీ అధికారంలో ఉంటే అనావృష్టి,మరో పార్టీ అధికారంలోకి వస్తే అతివృష్టి ఈ రెండు పార్టీల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం కూడా లేదు. వ్యక్తిగత విమర్శలు వదిలి ఇప్పటికైనా ప్రభుత్వం రైతులపై మొండి వైఖరిని వదిలి వెంటనే న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగిరి శ్యాంకుమార్,బెస్త శ్రీనివాసులు గొట్లూరు రామాంజనేయులు, ఆకుల రామసుబ్బయ్య, నాయుడు నాయక్, కోలా నాగార్జున, పేరూరు శీన, జయప్ప,శంకరప్ప, గోపీనాయక్,మధు,సత్య ప్రకాష్,చంద్రబాబునాయుడు, జై రామ్,గోపాల్,రామచంద్ర, మరియు జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.