జనసైనికుడి కుటుంబానికి అండగా “గల్ఫ్ జనసేన కమ్యూనిటీ”

ఏలూరు నియోజకవర్గం: తిమ్మరావుగూడెం గ్రామానికి చెందిన జనసైనికుడు యంగల శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీనివాస్‌కు వృద్ధ తల్లి, అనారోగ్యంతో బాధపడుతున్న అక్క ఉన్నారు.

శ్రీనివాస్‌కు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేకపోవడంతో ఇన్సూరెన్స్ సాయం అందే అవకాశం లేకుండా పోయింది. ఈ క్లిష్ట పరిస్థితిలో గల్ఫ్ జనసేన కమ్యూనిటీ సభ్యులు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

సభ్యులు సేకరించిన రూ.30,000 నగదును దెందులూరు జనసేన ఇన్చార్జ్ గంట వెంకటలక్ష్మి చేతుల మీదుగా శ్రీనివాస్ తల్లికి అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచిన గల్ఫ్ జనసేన కమ్యూనిటీ సభ్యుల సహృదయతను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

ఒక జనసైనికుడి కుటుంబం కష్టాల్లో పడకుండా నిలబెట్టే ఈ ఐక్యతే జనసేన బలం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాండురంగా మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.